BB4 Telugu Episode 18 Highlights in Telugu – ఉక్కు హృదయం ఆ టీం గెలిచింది

ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరు మైండ్ బ్లాక్ అనే సాంగ్ తో ఫుల్ జోష్ మీద డే స్టార్ట్ చేస్తారు .

అవినాష్ ఛార్జింగ్ ఇవ్వమని మనుషుల టీంతో డిస్కస్ చేస్తాడు. అందరికి వాష్రూమ్ యాక్సిస్ ఇస్తే త్రి పాయింట్స్ ఒక్కడికే ఇస్తాము అని వాళ్ళు అంటారు. అందరిని పంపించడం కుదరదు కదా మా టీం ఒప్పుకోదు కదా అని అవినాష్ అంటాడు.
అప్పుడు దివి ఒక పాయింట్ రైజ్ చేస్తుంది మా టీం అగ్రిమెంట్ జరగకుండా బలవంతంగా నా దగ్గర ఛార్జింగ్ తీసుకున్నారు కదా అలాగే టీం అగ్రిమెంట్ లేకుండా నువ్వు ఒక్కడివి మాకు అందరికి యాక్సిస్ ఇవ్వు అంటుంది. దానికి అవినాష్ ఒప్పుకోడు.

రోబోల టీం ఛార్జింగ్ దిగిపోతూ ఉంటుంది. మనుషుల టీం అరియనా మైక్ వాష్రూమ్ లో ఉంటే అక్కడే ఉండి ఎవరైనా వస్తే అట్టాక్ చేదాం అని అనుకుంటారు.

Also see: Bigg Boss 4 Telugu Voting

అరియనాకి మైక్ ధరించమని బిగ్ బాస్ వార్నింగ్ ఇస్తారు. దేవి తన మైక్ తీసి అరియనాకి ఇస్తుంది.

అవినాష్ మెళ్ళిగా వెళ్ళీ అమ్మ రాజశేఖర్, దివితో మాటలు కలుపుతూ ఛార్జింగ్ పెట్టేసుకుంటాడు. అవినాష్ ని మనుషుల టీం నమ్ముతారు. కొద్దిసేపటికి దివి గమనించి ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు అని చెప్తుంది. ఛార్జింగ్ అవ్వలేదు అని వాళ్ళు అనుకుంటారు కానీ అవినాష్ ఛార్జింగ్ పాయింట్ పెరుగుతుంది. మనుషుల టీం అందరు డిసప్పోఇంట్ అవుతారు.

అవినాష్ ఛార్జింగ్ పెట్టుకున్నందుకు అమ్మ రాజశేఖర్ అవినాష్ మీద సీరియస్ అవుతారు. రోబో టీం అందరి మీద మనుషుల టీం సీరియస్ అవుతారు . నమ్మకద్రోహం
చేసి అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఇలాంటి గేమ్స్ ఆడొద్దు అని సీరియస్ అవుతారు.

ఇంతలో సుజాత తనకి ఆరోగ్యం బాగాలేదు అని నేను ఛార్జింగ్ ఇచ్చి యాక్్సస్ తీసుకుంటా అని వాళ్ళ టీం తో అరుస్తుంది. అవినాష్ అంత ఈజీ గ వచ్చి పాయింట్ తీసుకొని వెళ్ళాడు దానికి ఎం చేస్తారు అని సీరియస్ అవుతుంది.

Also see: BB4 Telugu Voting

మోనాల్ గంగవ్వ రోబో డ్రెస్ తీసుకొని వాళ్ళ టీం మేట్స్ కి ఇస్తుంది దానితో గంగవ్వ సీరియస్ అవుతుంది. మోనాల్ అరియనా కొద్దిసేపు అరుచుకుంటారు. మనుషుల టీం వాష్రూమ్ యూస్ చేస్తున్నారు అని మీకు యాక్సిస్ లేదు అని వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంది కానీ మోనాల్ లాస్య ని పట్టుకొని లాగడం తో ఇద్దరు క్రింద పడతారు.

గంగవ్వ కి ఛార్జింగ్ ఇస్తాము అని వాళ్ళు కొన్నిటికి యాక్సిస్ తీసుకుంటారు.
రోబోలు ఐన అవినాష్, కుమార్ సాయి, లాస్య, హారిక,అరియనాల ఛార్జ్ తగ్గిపోవడం వలన చనిపోతారు.

అవినాష్ అమ్మ రాజశేఖర్ ని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు కానీ అమ్మ రాజశేఖర్ నన్ను మోసం చేసాడు లైఫ్ లో మాట్లాడను నమ్మను అని చెప్తాడు.

చివరికి ఉక్కు హృదయం టాస్క్ లో రోబోల టీం విన్ అవుతుంది. అభిజీత్ మరియు గంగవ్వ టీం బాటరీలు ఇంకా ఉండడం వాళ్ళ రోబోల టీం విన్ అవుతుంది.

మోనాల్ అభిజీత్ తో ఇంకా కోపంగ ఉంటుంది తనకి వేరే పని ఇవ్వమని కిచెన్ టీం లో ఉండను అని కెప్టెన్ ఐన నోయెల్ తో చెప్తుంది. నోయెల్ మోనాల్ కి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ తాను కోపంలో ఏడ్చేస్తుంది. అభిజీత్ తనకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు అని అంటుంది.

అభిజీత్ కి హౌస్ లో ఉండాలి అనిపించట్లేదు అని హారిక తో చెప్తాడు.
దేవి మోనాల్ మధ్య మళ్ళి అభిజీత్ టాపిక్ వస్తుంది. నేను అభి తో మాట్లాడుతుంటే హారిక రెస్పాండ్ అవుతుంది అని చెప్తుంది. దివి తన వల్ల లోపలికి వెళ్ళీ అల రోబోలకి చిక్కింది అని గిల్టీ ఫీల్ అవుతున్న అని చెప్తుంది.

Also see: Bigg Boss 4 Telugu Watch in USA

రోబో టీం సభ్యులు వాళ్ళ టీం నుంచి నలుగురిని బెస్ట్ పెరఫార్మెర్స్ ని కెప్టెన్ పోటీదారులుగా బిగ్ బాస్ ఎంపిక చేయమంటారు.

గంగవ్వ అవినాష్ అభిజీత్ మరియు హారిక ని ఎంపిక చేస్తారు.
తర్వాత ఇంటి సభ్యులంతా కలిసి మనుషుల టీం లో నుంచి వరస్ట్ పెరఫార్మెర్ ని ఎంచుకోమని బిగ్ బాస్ చెప్తారు.

బిగ్ బాస్ కోరిక మేరకు నోయెల్ కి యూనానిమ్స్ గ వరస్ట్ పెరఫార్మెర్ గ ఇంటి సభ్యులు నిర్ణయిస్తారు.

నోయెల్ ని జైలు లో పెట్టడం జరుగుతుంది. తనకి ఫుడ్ రాగి జావా లేకపోతే ఏదైనా ఒక పండు మాత్రమే ఇవ్వాలి అని బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తారు.

రేపటి ఎపిసోడ్ లో మరో వైల్డ్ కార్డు ఎంట్రీగ స్వాతి రాబోతుంది.

2 thoughts on “BB4 Telugu Episode 18 Highlights in Telugu – ఉక్కు హృదయం ఆ టీం గెలిచింది”

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top